logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పదో తరగతి ప్రతిభావంతులకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందనలు

నరసరావుపేట నియోజకవర్గంలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన సభకు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 550 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 82 మందిని, 500 పైచిలుకు మార్కులు సాధించిన 300 మంది విద్యార్థులను ఆయన వ్యక్తిగతంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించడం గర్వకారణమని ప్రశంసిస్తూ, దీనికి కృషి చేసిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వంటి పథకాలు పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్న ఎంపీ గారు, విద్యార్థులు కొత్త నైపుణ్యాలు నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

4
18 views

Comment