logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బి ఎల్ ఏ వ్యవస్థ పార్టీకి ఎంతో కీలకం

శుక్రవారం భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించిన విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను ,వారి కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ)
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ విశాఖ పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబూరావు హాజరై పార్టీ బలోపేతం, కమిటీ వ్యవస్థ, బీఎల్ఏ (BLA) నమోదు ప్రక్రియపై నాయకులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ గ్రామ కమిటీలు, వార్డ్ కమిటీలు పూర్తి చేసిన విధంగానే, వార్డ్ కమిటీల రీ-వెరిఫికేషన్ను కూడా కచ్చితంగా వారం రోజుల కాలపరిమితిలో పూర్తి చేయాలని సూచించారు. కమిటీ సభ్యుల వివరాలు పూర్తయితే వారికి ఐడి కార్డులు జారీ అవుతాయని, తద్వారా పార్టీ కుటుంబ సభ్యులుగా గుర్తింపు లభించి ఇన్సూరెన్స్ వంటి పలు ప్రయోజనాలు అందుతాయని తెలిపారు.
అలాగే బీఎల్ఏ (Booth Level Agent) వ్యవస్థ పార్టీకి ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి బూత్లో ఓటర్ల వివరాలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు వంటి అంశాలపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో పార్టీకి బూత్ స్థాయిలో బలమైన సమాచార వ్యవస్థగా బీఎల్ఏలు పనిచేస్తారని, ప్రతి నాయకుడు బాధ్యతగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.

ప్రతి బూత్కు మంచి అవగాహన, పార్టీపై పట్టు, ప్రజలతో మమేకం అయ్యే సామర్థ్యం ఉన్న వారిని కొత్తగా బీఎల్ఏలుగా నియమించాలని చిన్న శ్రీను స్పష్టం చేశారు. ఓటరు జాబితాపై పూర్తి అవగాహన కలిగి, పార్టీ కోసం సమర్థవంతంగా పనిచేసే నాయకత్వ లక్షణాలు ఉన్న వారికే బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సమన్వయంతో పనిచేస్తే భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని చిన్న శ్రీను పేర్కొన్నారు.

కార్యకర్తే పార్టీకి వెన్నెముక బూత్ స్థాయి నుంచే విజయానికి బాటలు వేయాలి అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో..

భీమిలి నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నియోజకవర్గ, వార్డు అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళా ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

79
3626 views

Comment