నేటి నుండే తొండపిలో వేమన శతక పద్యాలపై ఉచిత శిక్షణ తరగతులు
కిన్నెర మైత్రి కళావేదిక ఆధ్వర్యంలో తెలుగువారి పంచామృతం మన వేమన శతకం అనే అంశంపై ముప్పాళ్ళ మండలం, తొండపి గ్రామంలోని దళితవాడ కమ్యూనిటీ హాలులో పది రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుండి 25 వరకు ప్రతిరోజూ ఉదయం 8:00 నుండి 9:30 గంటల వరకు సాగే ఈ తరగతుల్లో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వేమన పద్యాలలోని నీతిని, మాధుర్యాన్ని మాతృభాష ఉపాధ్యాయులు బోధించనున్నారు. మాతృభాషలోని గొప్పతనాన్ని నేటి తరానికి అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని కళావేదిక నిర్వాహకులు మాతంగి రాహుల్ గౌతం, కుడ్మిత కిన్నెర తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆధార్ కార్డుతో హాజరు కావాలని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 7671928051 నంబరును సంప్రదించాలని వారు కోరారు.