logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వేసవికాలం ఆరుబయట పడుకునే వారు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల విజ్ఞప్తి.

నంద్యాల జిల్లా సిరివెళ్ల సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు పోలీసు వారు దొగలపట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వేసవికాలం కావున ప్రతి ఒక్కరూ కరెంట్ కోతల వల్ల ఆరు బయట పడుకోవడానికి ఇష్టపడతారు. ఇదే అదునగా దొంగలు మీ ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు ఆభరణాలు విలువైన డాక్యుమెంట్లను దొంగతనం చేయడానికి అవకాశంగా భావిస్తారని,కావున దయచేసి ప్రజలందరూ తమ విలువైన వస్తువులను ఆభరణాలను మీకు నచ్చిన బ్యాంకు లాకర్ నందు ఉంచుకోవాలనీ,అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే డయల్ 100 కి ఫోన్ చేయాలని సిరివెళ్ల సిఐ మరియు రుద్రవరం ఎస్సై తెలిపారు. అలాగే అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరు మీ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ తెలియజేశారు.

34
1462 views

Comment