సాలూరు 5వ వార్డు లో జనసేన విస్తృత స్థాయి పర్యటన లో పాల్గొన్న గుమ్మా నాగార్జున...
సాలూరు పట్టణ ఎస్సీ వార్డులలో విస్తృతస్థాయి పర్యటన నిర్వహించినట్టు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ జనసేన కౌన్సిలర్ ప్రతినిధి గుమ్మా నాగార్జున తెలిపారు. సాలూరు ఎస్సీ వార్డులకు సంబంధించి మాల వీధి, మాదిగవీధి, రెల్లివీధి, పాకివీధి, ఎరుకుల వీధి, మెంటాడ వీధి తదితర ప్రాంతాల పెద్దలు పాల్గొని వార్డుల లో సంబంధిత వీధులలో పర్యటన జరిపి సమావేశం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఎస్సీ వార్డులలో జనసేన పార్టీ జయ కేతనం ఎగిరేలా చేస్తామని ఈ సందర్భంగా 4వ వార్డ్ మాజీ కౌన్సిలర్, రెల్లి వీధి పెద్దలు నిమ్మకాయల విజయ్ కుమార్ తెలిపారు. త్వరలో జరగనున్న పార్టీ మీటింగ్ కు ముందస్తు ప్రక్రియ జరుగుతుందని అన్నారు. వార్డుల అభివృద్ధి , జనసేన బలోపేతం వంటి అన్ని విషయాలలో గుమ్మా నాగార్జునకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు నేతలు తెలియజేశారు.