logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భద్రాచలంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలి! ...ఆదివాసీ న్యాయవాదుల సంఘం, తెలంగాణరాష్ట్ర...

భద్రాచలంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలి!
...ఆదివాసీ న్యాయవాదుల సంఘం, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సున్నం రమేష్ డిమాండ్..

భద్రాచలం, 14 మే 2026

భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలోముఖ్యంగా ITDA రోడ్డు, చర్ల రోడ్డు మరియు కునవరం రోడ్డు పరిసర ప్రాంతాల్లోమద్యం దుకాణాలు యథేచ్ఛగా కొనసాగుతూ, అక్కడికక్కడే మద్యం సేవించేందుకు (On-Premise Consumption) సౌకర్యాలు కల్పించడం తీవ్ర ఆందోళనకరమని ఆదివాసీ న్యాయవాదుల సంఘం, తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ఉపాధ్యక్షులు అడ్వకేట్ సున్నం రమేష్ పేర్కొన్నారు.
ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా లైసెన్స్ పొందిన వైన్ షాపులతో పాటు అక్రమ బెల్ట్ షాపులు కూడా భద్రాచలం పట్టణమంతా విస్తరించి, ఎటువంటి నియంత్రణ లేకుండా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
ప్రత్యేకంగా ITDA కార్యాలయానికి ఎదురుగా ఒక మద్యం దుకాణం కొనసాగుతుండగా, మరో దుకాణం ITDA ప్రాంగణంలోని శివాలయానికి సుమారు 500 మీటర్ల పరిధిలోనే నడుస్తోందన్నారు. అదేవిధంగా చర్ల రోడ్డులోని APRJC గురుకుల పాఠశాల మరియు కళాశాలకు సమీపంలోనే రెండు మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయని, దీనివల్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ఎక్సైజ్ చట్టం, 1968 (Telangana Excise Act, 1968), తెలంగాణ ఎక్సైజ్ (Grant of Licence of Selling by Shop and Conditions of Licence) Rules మరియు ప్రభుత్వ ఉత్తర్వులు (G.Os) ప్రకారం విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు మరియు ప్రజా ప్రాధాన్య ప్రాంతాలకు సమీపంలో మద్యం విక్రయాలు నిషేధితమని గుర్తుచేశారు. ముఖ్యంగా:
Article 47 of the Constitution of India ప్రకారం ప్రజల ఆరోగ్య పరిరక్షణ దిశగా మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత.Telangana Excise Act, 1968 ప్రకారం ప్రజా శాంతి, భద్రత మరియు సామాజిక ప్రయోజనాలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరగరాదు.G.O.Ms.No. 402, Revenue (Excise-II) Department మరియు సంబంధిత ఎక్సైజ్ నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు, దేవాలయాలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో మద్యం దుకాణాలు అనుమతించరాదు.సుప్రీంకోర్టు మరియు వివిధ హైకోర్టుల తీర్పుల ప్రకారం ప్రజా భద్రత, విద్యార్థుల సంక్షేమం మరియు సామాజిక శాంతి పరిరక్షణలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉంది.

ప్రభుత్వం భద్రాచలాన్ని మినీ అయోధ్యగా ప్రచారం చేస్తూ, శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థాన అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తున్న సమయంలో, అదే పవిత్ర పట్టణంలో బహిరంగంగా మద్యం విక్రయాలు కొనసాగడం అత్యంత దురదృష్టకరమని అడ్వకేట్ సున్నం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.మద్యం దుకాణాలు మరియు బెల్ట్ షాపుల నియంత్రణలో అధికారుల వైఫల్యం కారణంగా భద్రాచలంలో నేరాల రేటు పెరుగుతోందని, దొంగతనాలు, హింసాత్మక ఘటనలు, మహిళలు మరియు అమాయక ప్రజలపై దాడులు అధికమవుతున్నాయని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు లైసెన్స్ పొందిన దుకాణాలు మరియు అక్రమ బెల్ట్ షాపులను సిండికేట్ల రూపంలో నిర్వహిస్తూ, మధ్యాహ్నం వేళల్లో కూడా బహిరంగంగా మద్యం వ్యాపారం సాగిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.
కాబట్టి భద్రాచలం పట్టణ పరిధిలోని అన్ని వైన్ షాపులు మరియు అక్రమ బెల్ట్ షాపులను తక్షణమే మూసివేసి, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ న్యాయవాదుల సంఘం, తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులు అడ్వకేట్ సున్నం రమేష్ డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోతే ప్రజాస్వామ్యపరమైన ఆందోళనలు, న్యాయపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు

33
7335 views

Comment