తక్షణమే బండి భగీరద్ ను అరెస్టు చేసి శిక్షించాలి....సిపిఐ(ఎం)ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్....
తక్షణమే బండి భగీరద్ ను అరెస్టు చేసి శిక్షించాలి....సిపిఐ(ఎం)ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్....
బండి బగీరద్ దిష్టిబొమ్మ దగ్దం
14 మే (ఖమ్మం ): ఇటీవల ఒక మైనర్ బాలికకు మద్యం తాగించి హత్యాచారానికి పాల్పడ్డ బండి భగీరధ్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో NST రోడ్ వద్ద బండి భగీరథ్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు .ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ., కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరద్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటి నీచానికి పాల్పడటం సిగ్గుచేటు అని,ఈ ఘటనను యావత్తు దేశ ప్రజలందరూ ఖండిస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు అయినా లేదని నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగాల ద్వారా కొడుకు క్రూరుడుగా మారడని, బండి సంజయ్ ప్రసంగాల్లో కూల్చటం, చీల్చడం,తొక్కడం, చంపడం, శివాలు, అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వల్ల కుమారుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నేను ఏ నేరం చేసిన నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే అహంకారంతో తన తండ్రి తన వెనుక ఉన్నాడని భరోసాతో, నన్ను కాపాడుతాడు అని నమ్మకంతో ఇలాంటి నిజమైన పనులకు ఒడిగడుతున్నాడని అని ఆరోపించారు. గతంలో కూడా తన తోటి విద్యార్థుల పై అరాచకంగా దాడి చేసిన ఘటనలు కూడా మన ముందున్నాయని అప్పుడే అతనిపై చర్య తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ నేరానికి పాల్పడి ఉండేవాడు కాదని ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం అతన్ని పదవి నుంచి తొలగించాలని నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మహిళల పట్ల బిజెపి పార్టీ ఎంత చులకన భావంతో ఉన్నదో ఎంత లెక్కలేని తనంతో ఉన్నదో అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయని బిజెపి నాయకులు ఒక్కొక్కరుగా మహిళలపై విరుచుకుపడుతున్నారని మహిళలకు చదువు ఎందుకని మాట్లాడుతున్నారని మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని కుట్రబుద్ధితో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా అమలు చేయడం లేదని ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, నాయకులు దొంగల తిరుపతిరావు, భుక్యా శ్రీనువాసురావు, పి నాగసులోచన, ఉపేంద్ర, మాజీ కార్పొరేటర్లు యర్రా గోపి, ఎల్లంపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.