వెలుగుడిఆర్డిఏ ఆధ్వర్యంలో ఎస్హెచ్జి క్రెడిట్ & జీవనోపాధుల ప్రణాళిక సమీక్ష
విజయనగరం జిల్లా. రాజాం.
వెలుగుడిఆర్డిఏ ఆధ్వర్యంలో ఎస్హెచ్జి క్రెడిట్ & జీవనోపాధుల ప్రణాళిక సమీక్ష
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డి.ఆర్.డి.ఏ వెలుగు ఆధ్వర్యంలో అమలవుతున్న స్వయం సహాయక సంఘాల క్రెడిట్ మరియు జీవనోపాధుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, అదనపు సంచాలకులు శ్రీమతి కె. సావిత్రి రాజాం, రేగిడి మండలాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా రాజాం మండలం బొద్దాం, గురవాం గ్రామాలు, అలాగే రేగిడి మండలం నాయరాలవలస, బురాడ గ్రామాల్లో సిసి లాగిన్లో ఫండ్ మ్యాపింగ్ ప్రక్రియను,వివోఏ లాగిన్లో సంఘ సభ్యుల బయోమెట్రిక్ నమోదు విధానాన్ని ఆమె పరిశీలించారు.
గ్రామ సంఘాల కార్యకలాపాలు, సభ్యుల వివరాల నమోదు, బయోమెట్రిక్ ధృవీకరణ, డిజిటల్ విధానాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఆమె, ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సభ్యుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడంతో పాటు ఫండ్ మ్యాపింగ్ను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం సభ్యులకు అవసరమైన సమయంలో అవసరాలకు అనుగుణంగా రుణాలు అందేలా సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంస్థాగత నిర్మాణం డిపిఎం ఏ. చిరంజీవి, ఫైనాన్స్ డిపిఎం జి. సీతారామయ్య, ఏపీఎం లు హేమలత, గోవిందరావు మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.