ధర్మపురి కోర్టుకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా న్యాయవాది జాజాల రమేష్ నియామకం
ప్రముఖ న్యాయవాది "జాజాల రమేష్" కు హృదయ పూర్వక అభినందనలు
ధర్మపురి కోర్టుకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా న్యాయవాది జాజాల రమేష్ నియామకం
ధర్మపురి:13
తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జగిత్యాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి -కమ్ - చైర్పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సి. రత్న పద్మావతి ఉత్తర్వులు జారీ చేస్తూ.... ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి - కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా నేరేళ్ల గ్రామానికి చెందిన న్యాయవాది జాజాల రమేష్ ను నియమించారు.
న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక సామర్థ్యం లేని వారికి గౌరవ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు
ఉచిత న్యాయ సహాయం అవసరమై - అర్హులైన వారికి మాత్రమే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా న్యాయ సేవలు అందించబడతాయని తెలిపారు.
ఇప్పటికే అనేక కేసుల్లో న్యాయంగా కేసులు వాదించి విజయం సాధిస్తూ.... అంకిత భావంతో..... అహర్నిశలు కృషి చేస్తున్న ప్రముఖ న్యాయవాది "జాజాల రమేష్" అందరి మన్ననలు పొందుతుండగా.... నేడు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జాజాల రమేష్ ను ప్రముఖులు, ఆయన బంధు మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందిస్తున్నారు.