పల్నాడు జిల్లావ్యాప్తంగా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం: లోక్ జనశక్తి పార్టీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తీని తీర్చేందుకు పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ప్రకటించారు. సత్తెనపల్లి తాలుకా కోర్టు గేట్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా, పార్టీ జాతీయ అధ్యక్షులు చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో ప్రజాసేవ చేస్తున్నామని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంగూరి అజయ్ కుమార్, సీనియర్ న్యాయవాది పూజల వెంకట కోటయ్యలు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ ఖాసిం పీరా, కొరబండి రాబర్ట్, మద్ది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు