నీట్ పేపర్ లీకేజీపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ భారీ నిరసన
హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజీపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ భారీ నిరసన మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ ల దిష్టిబొమ్మ దగ్ధం .. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
హిమాయత్నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ భారీ ఆందోళన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్నీ నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జక్కిడి శివచరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీతో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. మోడీ పాలనలో వరుస పేపర్ లీకులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మోడీ ప్రభుత్వంలో గత పదేళ్లలో 89 పేపర్ లీకులు కాగా, 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించడం సిగ్గుచేటు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం దేశ ప్రజానికానీకి సమాధానం చెప్పాలి అని అన్నారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు