logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

78 లక్షల మంది విద్యార్థులకు వరం: జూన్ 12న తల్లికి వందనం!

AIMA న్యూస్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. గత ప్రభుత్వ 'అమ్మఒడి' పథకాన్ని కొనసాగిస్తూనే, ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది.
రాష్ట్రంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది సుమారు 78 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కింద ప్రయోజనం పొందే అవకాశం ఉంది. విద్యాశాఖ సేకరించిన ఈ వివరాలను ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఈ తనిఖీ ప్రక్రియ పూర్తి చేసి, తుది అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఒక్కో తల్లి ఖాతాలో రూ. 15,000 జమ చేయనున్నారు. విద్యార్థులు బడి బాట పట్టే సమయానికే ఈ ఆర్థిక సాయం అందుతుండటంతో యూనిఫామ్స్, పుస్తకాలు, ఇతర అవసరాలకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పథకం సక్రమంగా లబ్ధిదారులకు చేరాలని ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
రేషన్ కార్డు: తెల్ల రేషన్ కార్డు మాగాణి 3 ఎకరాల లోపు లేదా మెట్ట 10 ఎకరాల లోపు ఉండాలి.
కరెంటు బిల్లు: నెలకు 300 యూనిట్ల లోపు వాడకం ఉండాలి.
పట్టణాల్లో 1000 చదరపు అడుగుల లోపు ఇల్లు ఉండాలి.
కారు ఉండకూడదు, ప్రభుత్వ ఉద్యోగులు కాకూడదు మరియు ఇన్కమ్ టాక్స్ కట్టేవారికి ఈ పథకం వర్తించదు.మీ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి స్థానిక సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

43
1750 views

Comment