logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు*

*ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు*
సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం
సీజే కాన్వాయ్కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
విజయవాడ, గుంటూరు పోలీసులకు డీజీపీ నుంచి కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆమెకు 'జడ్ ప్లస్' కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్కు ముప్పు పొంచి ఉందన్న అంచనాలు, సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన విజయవాడ, గుంటూరు పోలీసు కమిషనరేట్ల అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. రోజూ విజయవాడలోని తన నివాసం నుంచి అమరావతిలోని హైకోర్టుకు ప్రయాణించే మార్గంలో జస్టిస్ లీసా గిల్ కాన్వాయ్కు 'గ్రీన్ ఛానల్' ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. దీనివల్ల ఆమె ప్రయాణ సమయంలో కాన్వాయ్ ఎక్కడా ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుంటుంది.

జస్టిస్ లీసా గిల్ 2026 ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించారు

0
66 views

Comment