ఆళ్లగడ్డ అభివృద్ధికి ఎమ్మెల్యే అఖిలప్రియ కార్యాచరణ: అబాకస్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వడివడిగా అడుగులు వేస్తున్నారు. అటు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వినూత్నమైన వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభిస్తూనే, ఇటు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ స్థాయిలోనే 'గ్రీవెన్స్ డే'ని ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బుధవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలై శారీరక శ్రమకు, సృజనాత్మకతకు దూరమవుతున్నారని దీనిని నివారించేందుకు శోభా నాగిరెడ్డి (భూమా) ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యాంప్లను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్.స్పోకెన్ ఇంగ్లీష్, అబాకస్.క్రీడలు & రక్షణ: బాడ్మింటన్ మరియు తైక్వాండోలో నిపుణులచే శిక్షణ ఇప్పించనున్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ శిబిరాల్లో చేర్పించి, వారిలోని ప్రతిభను వెలికితీయాలని ఆమె కోరారు.ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఆళ్లగడ్డ ప్రజల కోసం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి శుక్రవారం నుండి నాలుగు శుక్రవారాలపాటు ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. దీనివల్ల చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవస్థలు తప్పుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.