logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం. -- భూక్య రమేష్ పిలుపు. 17న రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి .

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయకుండా ప్రజల అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడిపించాలని కోరుతూ , ప్రైవేట్ కార్పొరేట్ వారి చేతుల్లో కబంద్ధహస్తాల్లో తాకట్టు పెట్టకూడదని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సదస్సును హైదరాబాదులో ఈనెల 17వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు , ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు అందరూ తప్పకుండా భాగస్వాములై ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఐక్యంగా కలిసి ఈ రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి, ఆర్టీసీ కార్మికులతో వాల్ పోస్టర్లు నేడు విడుదల చేశారు. ఈ విడుదల సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టకుండా ఉండేందుకోసం కార్మికులు ప్రజలు ఐక్యమై పోరాటాలను చేసే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలలో కార్మికులు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ,రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండి ప్రజల సంక్షేమం కోసం భారతదేశ అభివృద్ధి కోసం ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్యం గా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుట కోసం ప్రజలు కార్మికులు కంకణబద్దులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ మహత్తర పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు . ఎన్నికల ముందు ఒక మాట గద్దెనెక్కాక మరో మాట మాట్లాడుతూ ప్రజలను కార్మికులను మోసం చేస్తున్న పాలకవర్గాలను సన్మార్గంలో నడిపేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ప్రైవేటు రంగంలో ఉన్న పరిశ్రమలలో పనిగింతల విధానం పెంచడం కోసం వేతనాలు తగ్గించడం కోసం మానవ శ్రమను దోపిడీ చేయడం కోసం పాలకవర్గాలు ప్రయత్నం చేస్తున్నాయని ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు అన్నింటిని ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు ఇతర కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నాయని ఆయన తెలిపారు . వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉన్నచోట ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణగా నిలిచాయన్నారు వామపక్షాలను బలహీనపరిచి , కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇదే అదునుగా భావించి ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు ధారాధత్వం చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కార్మికులు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు సూరం ఐలయ్య గుగులోత్ సక్రం, బత్తుల నాగేశ్వరరావు, రఫీ, శ్రీనివాస్, రాణి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

4
14 views

Comment