logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హైదరాబాద్: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ కోర్టులో హాజరు

హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరైన వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్, LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, LHPS రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు కాన్సిరాం నాయక్, సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు చందర్ నాయక్ తదితరులు హాజరయ్యారు. వారు గత BRS ప్రభుత్వ హయాంలో నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా III టోన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణకు కూడా వారు హాజరయ్యారు. వైరా MLA మాళోత్ రాందాస్ నాయక్ ఈ కేసులు రాజకీయ ప్రేరేపితమని, గత BRS ప్రభుత్వ ఒత్తిడి కారణంగా తాము పై తప్పుడు కేసులు పెట్టారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంలో ప్రజల అభివృద్ధి కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. వారి వెంట న్యాయవాదులు విశ్వేశ్వరరావు, ఎల్లంకి వెంకటేశ్వరరావు, గూగులోతు కృష్ణ, అర్జున్ రావు తదితరులు ఉన్నారు.

3
748 views

Comment