logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇజ్రాయెల్లో ఉద్యోగ అవకాశాల కోసం శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం

ఇజ్రాయెల్లో ఉద్యోగ అవకాశాల కోసం శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం

Andhra Pradesh State Skill Development Corporation ఆధ్వర్యంలో వైఎస్సార్ కడప జిల్లాలోని అర్హత కలిగిన యువతకు ఇజ్రాయెల్ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు హోమ్ బేస్డ్ కేర్ గివర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీ సి. విజయ వినీల్ కుమార్ తెలిపారు.

ఈ నియామక ప్రక్రియ APSSDC OMCAP NSDC సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఇజ్రాయెల్లో రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. నెలకు సుమారు 1,99,770/- వరకు వేతనం అందించబడుతుంది.

అర్హతలు:

వయస్సు: 25 నుండి 45 సంవత్సరాల మధ్య

పురుషులు మరియు మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు

GDA / ANM / GNM / B.Sc Nursing / Post B.Sc Nursing అర్హత తప్పనిసరి

ప్రాథమిక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి

ఉద్యోగ బాధ్యతలు:

వృద్ధులు మరియు దివ్యాంగులకు సంరక్షణ

రోజువారీ కార్యకలాపాల్లో సహాయం

ఆహారం అందించడం

పరిశుభ్రత మరియు భద్రత పరిరక్షణ

రిజిస్ట్రేషన్, మెడికల్, వీసా మరియు ప్రయాణ ఖర్చులను అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది.

ఆసక్తి గల అభ్యర్థులు 15-05-2026 లోపు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

నమోదు కోసం:

Naipunyam Portal Registration

రెస్యూమ్ పంపవలసిన ఈమెయిల్:

skillinternational@apssdc.in

మరిన్ని వివరాలకు:

9988853335

8712655686

8790118349

8790117279

3
506 views

Comment