logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బండి భగీరథ్కు సిట్ నోటీసులు

బిజేపీ నేత బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.బాధితురాలి వివరాలను POCSO చట్టం ప్రకారం గోప్యంగా ఉంచినట్లు తెలిపారు. ప్రాథమికంగా ఈ కేసును భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు POCSO చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు.. అనంతరం బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా కేసును POCSO చట్టం సెక్షన్ 5(L) చదవబడిన సెక్షన్ 6 కిందకు మార్చినట్లు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా బండి సాయి భగీరథ్తో పాటు సంబంధిత వ్యక్తులు మే 13న మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణాధికారి ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

నోటీసులను పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇది ఇలా ఉండగానే ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ భగీరథ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా.. పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఘటన రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

0
0 views

Comment