logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏళ్ల తరబడి ఎదురుచూపులేనా? ఆళ్లగడ్డకు పార్కు భాగ్యం ఎప్పుడు?

AIMA న్యూస్ బ్యూరో.. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది ఆళ్లగడ్డ పట్టణ పరిస్థితి. వాణిజ్యపరంగా, రాజకీయంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ పట్టణంలో ప్రజలకు కనీస వినోదం కరువైంది. పగలంతా పనులతో అలసిపోయిన ప్రజలు సాయంత్రం వేళ కాసేపు ప్రశాంతంగా గడపాలన్నా, పిల్లలను ఆడుకోవడానికి పంపాలన్నా పట్టణంలో ఒక్కటంటే ఒక్క పార్కు కూడా లేకపోవడం గమనార్హం.సాధారణంగా పట్టణాల్లో సాయంత్రం వేళ మహిళలు, వృద్ధులు పార్కులకు వెళ్లి కాసేపు సేద తీరుతుంటారు. కానీ ఆళ్లగడ్డలో అలాంటి వసతి లేకపోవడంతో వారంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. నడక సాగించేందుకు (వాకింగ్) సరైన ట్రాక్ లేక ప్రధాన రహదారులపైనే ప్రాణాలకు తెగించి నడవాల్సి వస్తోందని వృద్ధులు వాపోతున్నారు.పట్టణంలో ఆటస్థలాలు, పార్కులు లేకపోవడంతో చిన్న పిల్లలు వీధుల్లో, ప్రధాన రహదారుల పక్కనే ఆడుకుంటున్నారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే చోట పిల్లలు ఆడుకోవడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆళ్లగడ్డ పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నా, మున్సిపాలిటీగా మారినా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పార్కుల నిర్మాణం జరగలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పట్టణంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటు చేయాలని పట్టణ పురప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.ప్రజల మాట. పిల్లలు బయటకు వెళ్తామంటే భయమేస్తోందిపట్టణంలో పిల్లల కోసం చిన్న పార్కు కూడా లేదు. ఇంట్లో ఉంటే ఫోన్లకు అలవాటు పడుతున్నారు, బయటకు పంపితే రోడ్లపై వాహనాల భయం. అధికారులు స్పందించి ఉయ్యాలలు, జారుడు బల్లలతో కూడిన పార్కును నిర్మించాలి.సుజాత, గృహిణి, ఆళ్లగడ్డ.
వాకింగ్ ట్రాక్ అవసరం.వయసు పైబడిన వారు సాయంత్రం కాసేపు కూర్చుని మాట్లాడుకోవడానికి చోటు లేదు. రోడ్లపై నడవడం వల్ల దుమ్ము, ధూళి సమస్యగా ఉంది. ఆహ్లాదకరమైన పార్కు ఉంటే మా ఆరోగ్యానికి, మనసుకి ఎంతో బాగుంటుంది. రామసుబ్బయ్య, విశ్రాంత ఉద్యోగి.

81
2294 views

Comment