సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే'.. సీఎం విజయ్ ముందే ఉదయనిధి స్టాలిన్ హాట్ కామెంట్స్!
తమిళనాడు శాసనసభ వేదికగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. 2023లో జాతీయ స్థాయిలో పెను వివాదానికి దారితీసిన "సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి" అనే తన పాత ప్రకటనను ఆయన అసెంబ్లీ సాక్షిగా మళ్లీ పునరుద్ఘాటించారుముఖ్యమంత్రి విజయ్ సభలో ఉండగానే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, సనాతన ధర్మంపై తన పాత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, దానిని నిర్మూలించాలన్న తన మాటలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు చేస్తుండగా.. ముఖ్యమంత్రి విజయ్ ఎదురుగా కుర్చుని ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఫ్లోర్పై అదే అంశాన్ని లేవనెత్తడంతో ప్రస్తుతం చర్చనీయంశగా మారింది.