కడప జిల్లా కడప నగరంలోని ఇంద్రానగర్ ఏటూరి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో
కడప జిల్లా కడప నగరంలోని ఇంద్రానగర్ ఏటూరి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ భద్రాద్రి రామాలయం సమిధానంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలతో మార్మోగింది.
ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.