పదవుల పంపకాలు మీ ఇష్టం.. కానీ రైతులను ఆదుకోండి. భూమా కిషోర్ రెడ్డి.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఎన్నికల హామీలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పూర్తిగా విస్మరించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై, స్థానిక నాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల కేటాయింపుపై జరుగుతున్న జాప్యంపై కిషోర్ రెడ్డి సెటైర్లు వేశారు.మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని మీరు జనసేన పార్టీకి ఇస్తారో లేక మీరే ఉంచుకుంటారో అది మీ అంతర్గత విషయం. మాకు ఆ పదవులతో సంబంధం లేదు. అని వ్యాఖ్యానించారు.పదవుల పంపకాలపై చూపిస్తున్న ఆసక్తిని రైతుల సమస్యల పరిష్కారంపై చూపాలని, వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాదికి 5 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చారని, కానీ గద్దె నెక్కాక ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. నిరుద్యోగులను నమ్మించి వంచించారని, నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలన ఎక్కడ జరిగిందో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని నిలదీశారు.మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో నియోజకవర్గం ఘోరంగా విఫలమైందన్నారు. నంద్యాల జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ, ఆళ్లగడ్డలో మాత్రం వాటి జాడ లేదని దుయ్యబట్టారు. సరైన మార్కెట్ సదుపాయం లేక రైతులు పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని, రైతుల బాధను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.