logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు శుభవార్త..!

కాంగ్రెస్ సర్కారులో ప్రభుత్వ పాఠశాలలకు మంచి ..!

రూ.1011(వెయ్యి 11 కోట్లు) కోట్లతో పాఠశాలల అభివృద్ధికి ప్రణాళిక

సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ పరమేశ్వర్ రెడ్డి

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (సీయూఆర్ఎ) పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి రూ.1011 కోట్ల నిధులను కేటాయించారని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల పరమేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. 11 పాఠశాలలో సమగ్ర పాఠశాల సముదాయ భవనాల నిర్మాణం, 17 పాఠశాలల అభివృద్ధికి, 164 ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఈ నిధులను మంజూరు చేసినట్టుగా చెప్పారు.

దీనిలో భాగంగానే 17 పాఠశాలల అప్గ్రేడేషన్కు రూ.364 కోట్ల నిధులను కేటాయించగా వీటిలో ఉప్పల్ నియోజకవర్గం నుంచి 3 పాఠశాలలు ఎంపిక చేసినట్టుగా చెప్పారు. ఉప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.18 కోట్లు, కుషాయిగూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.17.10 కోట్లు మొత్తం రూ.37.10 కోట్ల నిధులతో పనులను చేపట్టనున్నట్టుగా చెప్పారు.

9
621 views

Comment