నోములలో ఎలిజాల రామదాసు మృతి పై BRS నేతల సానుభూతి
నోముల: నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన ఎలిజాల రామదాసు అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతదేహానికి BRS పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతుని కుటుంబానికి BRS పార్టీ మండల ఉపాధ్యక్షుడు గుండగోని జంగయ్య గౌడ్ 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. నివాళులర్పించిన వారిలో యాదయ్య, ఏలిజాల సైదులు, ఎరుకలి యాదగిరి, గర్శకుటి వెంకన్న, ఎల్మకంటి రమేష్, బాధిని రాము, ఎల్మకంటి సైదులు, కొప్పు వెంకటేశ్వర్లు, ఆలగడప సైదులు, మాచర్ల శంకర్, బాధిని శీను, ఎలిజాల కృష్ణ, ఎలిజాల లక్ష్మణ్, సర్వయ్య జాన్ రెడ్డి తదితరులు ఉన్నారు.