తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రేపు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, మౌలిక సదుపాయాల శంకుస్థాపనలు జరుగనున్నాయి.
ప్రధానమంత్రి రూ. 2.360 కోట్లతో జహీ రాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. పార్టీ రాష్ట్ర నేతల మధ్య సమన్వయం సంపూర్ణంగా ఉండి, సభకు జనసమ్మేళనం కోసం బైక్ ర్యాలీలు, వాల్ రైటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సభ ప్రాంగణంలో జర్మన్ టెంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. బిజెపి తరఫున ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు బస్సులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.