నంద్యాలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఘనంగా నిర్వహణ
నంద్యాల: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు తలస్మియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనన్ట్ గారికి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రధమ వార్షికోత్సవ వేడుక నిర్వహించి కేక్ కట్ చేశారు.
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల, పిల్లల వార్డులో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్ ఎంవో హాస్పిటల్ ఇన్చార్జి సూపర్డెంట్ డాక్టర్ రఫీక్, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ సుదర్శనం, రెడ్ క్రాస్ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురూజీ, రెడ్ క్రాస్ ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాష, రెడ్ క్రాస్ మహిళ నాయకురాలు వసుందర దేవి, సిబ్బంది పాల్గొన్నారు. సుదర్శనం గారు రెడ్ క్రాస్ సేవలకు భవిష్యత్తులో సహకరించనున్నట్లు తెలిపారు.