చెన్నైలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
తమిళనాడు: తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగిపోయింది. సీపీఐ, సీపీఎం, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీలు విజయ్ బలాన్ని 120కి తీసుకు వచ్చాయి. విజయ్ రెండు చోట్ల పోటీ చేయడంతో ఒక సీటు మినహాయించాల్సి వచ్చింది, లేకపోతే బలం 121 ఉండేది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ అర్లేకర్‌ను విజయ్ కలిసి మద్దతు లేఖను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
రేపు ఉదయం 11 గంటలకు చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదాపు 20 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయొచ్చని సమాచారం ఉంది, వీరిలో వీసీకే నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారీ అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి రావడం గమనార్హం. అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు.