ఏఐ ఆధారిత సుస్థిర పరిష్కారాల గ్రాండ్ ఫినాలే నిర్వహణ
పాణ్యం :
శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల (ఆటోనమస్) ఆధ్వర్యంలో రెండు నెలల పాటు జరిగిన వర్క్ షాప్ ముగింపుగా "గ్రాండ్ ఫినాలే : ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్" కార్యక్రమం మే 8వతేది శుక్రవారం కళాశాల సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం, రిసోర్స్ పర్సన్ వై. ప్రణీత్ బాబు, హెచ్ఓడి డా. బి. శేషయ్యలు కృత్రిమ మేధస్సు ఆధారిత సుస్థిర పరిష్కారాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ వర్క్ షాప్ ద్వారా విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, పరిశోధనా దృష్టి, సృజనాత్మకత పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం Sustainable Development Goals (SDG-9, SDG-11 & SDG-13) లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని జరిగింది.కళాశాల బేసిక్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో బ్రెయిన్-ఓ-విజన్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో మరియు ఎస్ఆర్ఈసీ ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్, ఐఈఈఈ కంప్యూటర్ సొసైటీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.. కోఆర్డినేటర్లు, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.