logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పలమనేరు: అంగన్‌వాడీలకు నియామక ఉత్తర్వుల పంపిణీ

పలమనేరు: ప్రాథమిక విద్యాభివృద్ధి బాధ్యత అంగన్‌వాడీలదని పలమనేరు శాసన సభ్యుడు అమరనాథ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బైరెడ్డిపల్లి ప్రాజెక్టు పరిధిలోని వి.కోట, బైరెడ్డిపల్లి మండలాలకు చెందిన అంగన్‌వాడీ వర్కర్ మరియు 32 అంగన్‌వాడీ సహాయకులకు పట్టణంలోని తన కార్యాలయంలో నియామక ఉత్తర్వులు పంపిణీ చేశారు. ఈ ఏడాది జనవరిలో అంగన్‌వాడీ వర్కర్ మరియు 41 సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, మార్చిలో జరిగిన ఇంటర్వూలలో ఎంపికైన వారికి ఈ ఉత్తర్వులు అందజేయబడినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మహిళల సాధికారతకు అంగన్‌వాడీ వ్యవస్థ ముఖ్యమని, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగన్‌వాడీ కార్యకర్తల పాత్ర కీలకమని తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా నియామక ప్రక్రియను నిర్వహించి అర్హులైన వారికి అవకాశాలు కల్పించిందని అన్నారు. నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు ప్రభుత్వం మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సిడిపివో అరుణశ్రీ, సూపర్వైజర్లు లత, స్వర్ణలత, మాధవిలత, రాష్ట్ర వేర్ హౌస్ కమిటీ సభ్యులు రంగనాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ్, రాంబాబు నాయకులు ఈశ్వర్ గౌడ్, హరి, మంజునాథ్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

69
8738 views

Comment