నంద్యాల : ఎరువుల దుకాణాలపై మండల అధికారి తనిఖీలు
నంద్యాల : మే 8వతేది శుక్రవారం నంద్యాల మండల వ్యవసాయ అధికారి ప్రసాద రావు పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, రసీదులు, నిల్వలు, యూరియా నిల్వలు మరియు రోజువారీ అమ్మకాలను పరిశీలించారు.దుకాణాలలో సరైన ధ్రువపత్రాలు అందుబాటులో లేకపోవడంతో సుమారు 13 లక్షల విలువ గల 83 మెట్రిక్ టన్నుల ఎరువులను తాత్కాలికంగా అమ్మకపు నిలుపుదల చేశారు. అలాగే, పంటలు లేని సమయంలో యూరియా అధికంగా అమ్మిన 5 దుకాణాల లైసెన్స్‌లను 10 నుంచి 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ప్రసాద రావు ఎరువుల విక్రయాలపై నిబంధనలు పాటించాలని, FCO 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.