అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి నివారణ కార్యక్రమం
అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామం: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలోని భాగంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ కార్యక్రమం, దూడల ర్యాలీ మరియు వేసవిలో పశువులను సంరక్షించుకోవడానికి సూచనలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో 30 బర్లకు 25 ఆవులకు ఉచిత చికిత్స అందించి, 20 కిలోల గడ్డి విత్తనాలను సబ్సిడీ రూపంలో పంపిణీ చేశారు. సర్పంచ్ ఎడ్ల నర్సింహులు, ఉప సర్పంచ్ పయ్యావుల గంగాధర్, డైరీ ప్రెసిడెంట్ దుబ్బాక నర్సిరెడ్డి, ఆడి రైతులు చిన్నయ్య, శ్రీనివాస్ రెడ్డి, మోసర్ల రాజేందర్, శంకర్ వెంకట్, సిబ్బంది ఎల్ ఎస్ ఏ అహల్య, ఆఫీసు సబార్డినేట్స్ ఇస్మాయిల్, సాయి, గోపాలమిత్ర సిబ్బంది కాశిరెడ్డి మురళి పాల్గొన్నారు.