logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సికింద్రాబాద్‌లో యువకుడి నడిరోడ్డుపై దారుణ హత్య

సికింద్రాబాద్ : జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉండే యావన్(23) అనే బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థి ప్రేమించిన సీతాఫల్‌మండి యువతిని తరచూ కలుసుకుంటున్నాడు. యువతి తల్లిదండ్రులు దీనిపై ఎన్ని హెచ్చరికలు చేసినా యావన్ వినకుండా సీతాఫల్‌మండి తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ యువతిని కలుస్తున్నాడు.

నిన్న రాత్రి మూడు ద్విచక్ర వాహనాల్లో వచ్చి ఆరుగురు దుండగులు యావన్‌పై కత్తులతో దాడి చేశారు. యావన్ తప్పించుకోవడానికి ప్రయత్నించినా, నడిరోడ్డుపై దారుణంగా దాడి చేసి 17 చోట్ల కత్తితో గాయపరిచారు. దీంతో యావన్ అక్కడికక్కడే చనిపోయాడు. యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

0
164 views

Comment