logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గోరంట్లలో అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్ రూ.10 లక్షల స్వాధీనం

గోరంట్ల, మే 7: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు చోరీ కేసులను గోరంట్ల సీఐ B. శేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం విజయవంతంగా ఛేదించి, అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ దర్యాప్తు జిల్లా ఎస్పీ S. Satheesh Kumar ఆదేశాల మేరకు, పెనుకొండ SDPO U. Narasingappa పర్యవేక్షణలో జరిగింది. విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుండి రావుల ఆనంద్, గుమ్మడి సురేష్ అలియాస్ సూరి, నంబారు సుధీర్, కోరుకొండ త్రిమూర్తులు అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు పలు దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

2024 ఏప్రిల్ 2న చైతన్య స్కూల్ ఎదుట నుండి రూ.5.90 లక్షలు దొంగిలించి, 2025 జూలై 14న వాసవి కళ్యాణ మండపం ఎదుట కారు అద్దాలు పగులగొట్టి రూ.7 లక్షలను దొంగిలించిన కేసులు క్రైమ్ నెంబర్ 92/2024 మరియు 115/2025లో నమోదయ్యాయి. ఈ కేసులను ఛేదించిన గోరంట్ల సీఐ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

18
427 views

Comment