హైదరాబాద్: సమాచార కమీషన్ ముందు కలెక్టరేట్ అధికారులు గైర్హాజరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ గురువారున జరిగిన విచారణలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు హాజరుకాలేదని సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. కమీషన్ ఆదేశాలను భే ఖాతర్ చేస్తారని, గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కలెక్టరేట్ అధికారులు సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. నాలుగు కేసులపై విచారణ జరిగిందని, అధికారులు హాజరు కాకపోవడం పై కమీషన్ బాధ్యులు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు.
మరో కేసులో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఎస్సై యం.ఎ.జమీల్ సమాచార కమీషన్ ముందు హాజరయ్యారు. బుగ్గారం మండలం గోపులాపూర్ వైన్స్ దోపిడీపై ఎస్సై జమీల్ అసంపూర్ణ, పొంతన లేని సమాచారం ఇచ్చారని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై చుక్క గంగారెడ్డి మరలా సమాచార కమీషన్, జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ ఉన్నతాధికారులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.