రాజన్న సిరిసిల్లలో రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీ
రాజన్న సిరిసిల్ల: మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ సూచనల మేరకు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ నేడు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా ఆదేశించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి, మిల్లులకు సకాలంలో తరలించాల్సిందిగా సూచించారు. అలాగే, రైతులకు మద్దతు ధర పూర్తిగా అందేలా అన్ని చర్యలు తీసుకునేలా, తూకాలు మరియు ధాన్యం తరలింపులో అక్రమాలు జరగకుండా కఠిన పర్యవేక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాచకట్ల సురేష్, APM కుమారస్వామి, సర్పంచ్ M.రాజు, వార్డు సభ్యులు రేగుల కార్తిక్, సంబంధిత శాఖ అధికారులు మరియు ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గడ్డం నగేష్ హెచ్చరించారు.