కామారెడ్డి నేషనల్ హైవే లో బస్-లారీ ఢీకొనడం ఘటన
కామారెడ్డి: నేషనల్ హైవే 44 వద్ద పొందుర్తి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన లారీ ఆపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బోధన్ డిపోకి చెందిన సూపర్ లక్సరీ బస్ లారీని చూసుకోకుండా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్ లో ఉన్న కొన్ని ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అలాగే లారీ డ్రైవర్ ఘటన తర్వాత పారిపోయినట్లు తెలియ వచ్చింది. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.