జగిత్యాల PACSలో పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి అధ్యక్షత లో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరణ
జగిత్యాల: జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)లో నూతన పాలకవర్గ బాధ్యతల స్వీకరణ గురువారం అధికారికంగా పూర్తయింది. గౌరవ హైకోర్టు ఆదేశాలు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొత్త సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. సంఘ అధ్యక్షుడు శ్రీ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి రైతుల సంక్షేమాన్ని ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ఆరుముల్లా గంగారాం, కొక్కుల శంకరయ్య, తోట గంగరాజాం, అల్లాల రమేష్ రావు, బేతి రాజవ్వ, నిలం లక్ష్మి, ఏలేటి రాజిరెడ్డి, కంకణాల లింగయ్య, బొడ్డుల పోచమల్లయ్య, ముప్పారపు దేవమ్మ, సంఘ కార్యదర్శి గాజేంగి వేణు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక రైతులు నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో సంఘం మరింత పారదర్శకంగా రైతులకు సేవలు అందిస్తుందని ఆశాభావాలు వ్యక్తం చేశారు.