నంద్యాల సబ్ డివిజనల్ విజిలెన్స్ కమిటీకి వంకిరి రామచంద్రుడు నియామకం
నంద్యాల,
ప్రముఖ న్యాయవాది వంకిరి రామచంద్రుడు నంద్యాల సబ్ డివిజనల్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని నంద్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సి. విశ్వనాథ్ బుధవారం చేతుల మీదుగా అందజేశారు.రామచంద్రుడు తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపి, సబ్ డివిజన్ పరిధిలో పౌర హక్కుల పరిరక్షణ మరియు ప్రభుత్వ నిబంధనల అమలును పర్యవేక్షించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన ఎంపికపై తోటి న్యాయవాదులు, మిత్రులు మరియు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.