నల్లపరెడ్డి BLAలపై సమీక్ష సమావేశం నిర్వహణ
నెల్లూరు: మాజీ మంత్రి, వైసీపీ PAC సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ వైయస్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల (BLA) సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగింది.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి రావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి, బుచ్చి రూరల్ పార్టీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి, బుచ్చి మున్సిపాలిటీ అధ్యక్షులు షేక్ షాహుల్, విడవలూరు మండల అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి, కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీల ఇంచార్జ్ కొండూరు లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆనపల్లి ఉదయభాస్కర్ పాల్గొన్నారు.