కథలాపూర్ మండలం : బొమ్మెన గ్రామంలో బడిబాట కార్యక్రమం విజయవంతం
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. మండల విద్యాధికారి శ్రీ లోకిని శ్రీనివాస్ గారు హాజరై, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు మరియు ఈ విద్యా సంవత్సరంలో అందించబోయే 21 రకాల వస్తువుల ప్రత్యేక కిట్ గురించి తల్లిదండ్రులకు వివరించారు.
గ్రామ సర్పంచ్ శ్రీ చిందం సుధాకర్ గారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వారికి నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులకు తెలియజేశారు. కార్యక్రమంలో హై స్కూల్‌లో 12 మంది, ప్రాథమిక పాఠశాలలో 15 మంది కొత్త విద్యార్థులు చేరారు. గ్రామ రెండవ వార్డు సభ్యుడు శ్రీ జంగం రంజిత్ గారు తమ ముగ్గురు పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం ప్రత్యేకంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ మధు కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రవి, శ్రీ రమేష్, సిరికొండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు వసంత, జయలక్ష్మి, మహేష్, రాజశేఖర్, సవిత, శ్రీధర్, రాజేష్, రమేష్, అరుణ, శ్రీనివాస్, వెంకటేష్, సాయిరెడ్డి, శివకృష్ణ, ప్రశాంత్, మణికంఠ, శిరీష, శ్రావణి, ప్రసన్న దీప్తి, సౌమిక, రాజేశ్వరి, సి.ఆర్.పి విజయ్, అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి, ఈశ్వరమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో విద్యాపట్ల అవగాహన పెరిగి మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సాహం లభించింది.