బొమ్మెనలో బడిబాట కార్యక్రమం విజయవంతం
కథలాపూర్ మండలంలోని బొమ్మెన గ్రామంలో "బడిబాట" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. మండల విద్యాధికారి శ్రీ లోకిని శ్రీనివాస్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు మరియు ఈ విద్యా సంవత్సరంలో అందించబోయే 21 రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ గురించి తల్లిదండ్రులకు వివరించారు.
గ్రామ సర్పంచ్ శ్రీ చిందం సుధాకర్ గారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన మరియు సుశిక్షితులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వారి ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ 12 మంది, ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. గ్రామ రెండవ వార్డు సభ్యుడు శ్రీ జంగం రంజిత్ గారు తమ ముగ్గురు పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం ప్రత్యేకంగా నిలిచింది.