కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మదీనా కాలనీలో వదిలివేత శిశువు పై ఆసుపత్రి సిబ్బంది మమకారం బాన్సువాడ విలేకర్ SHAIK AMAIR
బాన్సువాడ: మదీనా కాలనీలో తల్లిదండ్రులు వదిలివేసిన ఒక శిశువుపై బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది చూపిన మమకారం అందరి హృదయాలను కదిలించింది. వారం క్రితం గుర్తు తెలియని వ్యక్తులు పుట్టిన శిశువును వదిలివేసిన సంఘటనపై కాలనీ వాసులు బాబు ప్రాణాలు కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల సహాయంతో శిశువును ఆసుపత్రికి తరలించి, నర్సులు, వైద్య సిబ్బంది ఎంతో ఆప్యాయతతో పాలు పెట్టడం, వైద్యం అందించడం, నిద్రపుచ్చడం వంటి అన్ని అవసరాలు తీర్చారు. మంగళవారం శిశు సంరక్షణ శాఖ అధికారులు ఆసుపత్రికి వచ్చి, డా. విజయ్ కుమార్ నుండి శిశువును అధికారికంగా తీసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టి శిశువుకు వీడ్కోలు పలికారు.