నెల్లూరు: కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయం కోసం పిలుపు
నెల్లూరు: జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, 16వ డివిజన్‌లో విజయలక్ష్మి, 51వ డివిజన్‌లో సనత్ కుమార్‌తో కలిసి కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభివృద్ధిని వివరిస్తూ వోటర్ల హౌస్ విజిట్స్ చేశారు. వారు ముఖ్య సభ్యుల ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు.
కిషోర్ గునుకుల కూటమి తరపున నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న సేవలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి విజన్‌ను ప్రజలకు వివరించారు. అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజల సహకారం అవసరమని కిషోర్ గారు కోరారు.