logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జగిత్యాల: జిల్లా పంచాయతీ అధికారిపై చర్యలు కోరారు

జగిత్యాల: బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 కొత్త పాలకవర్గం ఏర్పడేవరకు గత పాలకవర్గం, స్పెషల్ ఆఫీసర్ కాలంలో గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో చట్ట ఉల్లంఘనలూ, ఆర్థిక దుర్వినియోగం జరిగిందని మేకల అక్షయ్ కుమార్ సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్ కు పిర్యాదు చేశారు. ఈ విషయంపై పత్రికా ప్రకటన విడుదల చేసి ఆయన మాట్లాడారు.

అక్షయ్ కుమార్ ఆరోపణల ప్రకారం, జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ మద్దునూర్ గ్రామపంచాయతీ పనులు, బిల్లుల చెల్లింపు రికార్డులు తనిఖీ చేయలేదు. సమాచార హక్కు చట్ట బోర్డు ఏర్పాటు చేయకపోవడం, రిజిస్టర్ల నిర్వహణలో లోపాలు ఉన్నాయని, పలు ఫిర్యాదులను పర్యవేక్షించకుండా కాలయాపన చేస్తూ అవినీతి పరిస్థితులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో, చీకోటి మదన్ మోహన్ పై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తగిన విధంగా తీసుకోవాలని కోరారు.

2
47 views

Comment