పాఠశాల విద్యాశాఖ అకడమిక్ షెడ్యూల్ పాటించమని ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన మరియు సిలబస్ పూర్తిచేయడంలో ఉన్న ఉల్లంఘనలపై పాఠశాల విద్యాశాఖ సీరియస్‌గా స్పందించింది. కొన్ని పాఠశాలల్లో సిలబస్ వేగంగా పూర్తవుతూ, మరికొన్నిల్లో సకాలంలో పూర్తి చేయడంలేదు. విద్యార్థులు అర్థం చేసుకున్నారా లేదా పట్టించుకోవడం లేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించారు.
విద్యాశాఖ తాజా ఆదేశాలలో ప్రతి అధ్యాయం పూర్తిచేసి కాలపరిమితిని పాటించాలని, బోధనా వేగం సముచితంగా ఉండాలని, పునశ్చరణ అభ్యాసాలు నిర్వహించాలని పేర్కొంది. హెడ్మాస్టర్లు సిలబస్ పురోగతిని పర్యవేక్షించి, షెడ్యూల్‌కు అనుగుణంగా బోధన సాగించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.