logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎస్సీ హోదా విషయంలో దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాటం

ఎమ్మిగనూరు: సుప్రీంకోర్టు ఇచ్చిన క్రైస్తవంగా మారిన దళితులకు ఎస్సీ హోదా ఉండదని తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తెలిపారు. ఈ తీర్పును పునర్విచారణకు రాజ్యాంగ బెంచ్‌కు పంపాలని, క్రైస్తవులుగా ఉన్న దళితులను ఎస్సీగా కొనసాగించేందుకు రాజ్యాంగ సవరణ అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ రాజేశ్వరి హోటల్ ఫంక్షన్ హాల్‌లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన దళిత క్రైస్తవుల సదస్సులో ఆండ్ర మాల్యాద్రి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు యస్. దేవసహాయం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఆనంద్ బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జి. ఆనంద్ చైతన్య మాదిగ, కోరిశెట్టి మాల మధు బాబు, కదిరికోట ఆదెన్న, సి. గోవిందు, ఎరుకుల కృష్ణ, ఆరెకంటి భాస్కర్, బి. కరుణాకర్ తదితరులు ప్రసంగించారు. వారు మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని, రాజ్యాంగ హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సదస్సులో పాస్టర్ల అసోసియేషన్ నేతలు రెవ.యోహాను, రెవ. వీరేశ్, రెవ.ఎలీషా, రెవ.జాన్ సామే, రెవ.ఆశేర్ భూషణం, రెవ. జీవన్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు గంజ హళ్ళి మహాదేవ్ మాదిగ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, రైతు కూలీ సంఘం నాయకులు యస్. రాజు, మహిళా నాయకురాలు ఇ లాది జయమ్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వారు దళిత మత స్వాతంత్ర్య హక్కును హరించిన 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పిలుపునిచ్చారు.

0
15 views

Comment