మందా రవి శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు
కోవూరు: వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మందా రవి ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని కోవూరు పట్టణంలోని తూర్పు అరుంధతివాడలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శ చేసి రవి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వీరి చలపతిరావు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి, మల్లికార్జున రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, కవరగిరి శ్రీలత, బలంరెడ్డి చెంచు రెడ్డి, కవరగిరి ప్రసాద్, అంజన్ రావు, బుడంగుంట శ్రీనివాసులు, హరిబాబు, బ్రహ్మయ్య, చక్రి తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.