నకిరేకల్: వేముల వీరేశం బాధిత కుటుంబాలకు సాయం అందించారు
నకిరేకల్: నిన్న సాయంత్రం వీచిన ఈదురు గాలులకు నకిరేకల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీ వాసుల ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో నష్టపోయిన కుటుంబాలను ఈరోజు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం స్వయంగా పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి తక్షణ సహాయం అందజేశారు.
వేముల వీరేశం మాట్లాడుతూ సహజ విపత్తుల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సంబంధిత అధికారులకు నష్టాన్ని అంచనా వేయించి, ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని, బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.