logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నీటి సమస్యకు చెక్.. బోర్ శాంక్షన్.. 19వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ కేతావత్ స్వప్న 200 అడుగుల లోతులో నీరు.. ఆనందం వ్యక్తం చేస్తున్నా డివిజన్ ప్రజలు

19వ డివిజన్: నేతాజీ బస్తి, వనం దాస్ గడ్డ ప్రాంత ప్రజలు నీటి సమస్యతో బాధపడుతున్నట్లు 19వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ కేతావత్ స్వప్న నాయక్ తెలిపారు. ఆదివారం నేతాజీ స్కూల్ సమీపంలో జువాలజికల్ సర్వే డిపార్ట్మెంట్, మునిసిపాలిటీ అధికారులు వచ్చి 200 అడుగుల లోతులో నీరు ఉందని గుర్తించారు.డాక్టర్ కేతావత్ స్వప్న నాయక్ ఆ ప్రాంత ప్రజలకు గత ఏప్రిల్ 12న పర్యటనలో ఇచ్చిన మాటను బదులుగా బడ్జెట్ సమావేశంలో 4 బోర్లు కోసం తీర్మానం పొందారు. అందులో ఒక బోరు ఇప్పటికే శంక్షన్ అయింది మరియు మిగతా బోర్లు త్వరలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పవర్ బోరు మంజూరు కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరి కుమార్, కల్లూరి సమ్మయ్య, బానోత్ రాజ్ కుమార్, బానోత్ శ్రీనివాస్ నాయక్, బోడ హరి, భూక్యా హరి, బానోత్ వినోద్, బోడ కృష్ణ బస్తివాసులు పాల్గొన్నారు.

64
1179 views

Comment