logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పాడేరు: సమ్మర్ క్యాంపులో కరాటే శిక్షణ ప్రారంభం

పాడేరు: మోదకోండమ్మ తల్లి ఆడిటోరియంలో సమ్మర్ క్యాంపు - 2026 కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శిక్షకులు బాకూరు పాండురాజు ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జగన్మోహన్ రావు పర్యవేక్షణలో ఈ శిక్షణ ఈ నెల 31 వరకు కొనసాగుతుందని తెలిపారు.

ఈ శిక్షణ విద్యార్ధులు మరియు విద్యార్థినులు వినియోగించుకోవాలని పాండురాజు సూచించారు. ఆసక్తిగల వారు ఆధార్ జిరాక్స్ మరియు 3 పాస్ ఫొటోలతో రిజిస్ట్రేషన్ చేయవచ్చని చెప్పారు. ప్రత్యేకంగా విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పించడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు పాండురాజు పేర్కొన్నారు.

1
0 views

Comment